మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్
మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద గురువారం మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ గాంధీ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ- దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ చేసిన త్యాగాలు అపారమైనవి. ఆయన ఎంచుకున్న అహింసా మార్గం ప్రపంచానికి ఒక ఆదర్శం.ఆయుధ పోరాటం కాకుండా నిజాయితీ,సత్యం, అహింసలతో స్వాతంత్ర్య సమరాన్ని విజయవంతం చేశారు.గాంధీ చూపిన ఆలోచనలు,మార్గదర్శకాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.మన సమాజంలో శాంతి,సామరస్యాలు నెలకొల్పాలంటే ప్రతి ఒక్కరూ ఆయన చూపిన దారిలో నడవాలి అని పిలుపునిచ్చారు.అంతేకాకుండా,ఆయన సమాజంలో నిజాయితీ,నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు.ప్రజలంతా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తే సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం నెలకొంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రపు శ్రీనివాస్ పటేల్,సందీప్ కుమార్, రమేష్ కుమార్,సత్య గౌడ్,బాల్ సాయిలు,అనిస్,డాక్టర్ వెంకటేశం,స్థానిక వైశ్యుల, తదితరులు పాల్గొన్నారు.









