మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ )నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు రమేష్ గౌడ్ పూలమాల వేసి మహాత్మునికి నివాళులర్పించారు.ఆయన మాట్లాడుతూ – గాంధీ జీవితమే ఒక ప్రేరణ అని, నిజాయితీ, అహింస, సత్యాగ్రహం మార్గాలను చూపిన మహనీయుడని అన్నారు. మనందరం ఆయన బాటలో నడిచే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. గాంధీ చేసిన త్యాగాలు, పోరాటాలు స్వాతంత్ర్య భారతానికి దారితీసాయని, ఆ ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకమని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ సంగయ్య, నాయకులు ఆనంద్ కుమార్, బొడ సాయిలు,నటకరి లింగయ్య, శ్రీకాంత్, మల్ల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.









