
మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) విజయదశమి పర్వదినం సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు దంపతులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ప్రతి ఏడాది దసరా పర్వదినాన సంప్రదాయబద్ధంగా జరిగే విధంగానే ఈసారి కూడా ఆయుధ పూజ,వాహన పూజలను భక్తి శ్రద్ధలతో ఆచరించారు.ముందుగా కార్యాలయ ప్రాంగణంలో వాహనాలను అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆయుధ పూజ చేస్తూ విజయదశమి మహిమలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు స్థానిక ప్రజలతో కలసి పూజలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ… విజయదశమి పర్వదినం చెడుపై మేలుకి సంకేతమని, శక్తి సాధనకు ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు.జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఇంటికీ సిరి సంపదలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.










