
(మన ధ్యాస న్యూస్ ) వరికుంటపాడు అక్టోబర్ 1
వరికుంటపాడు మండలంలోని రామాపురం కాకోలు వారి పల్లి లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం.ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు వరికుంటపాడు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ బిషఫ్ ఓబులాపురం దేవప్రసన్న మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ఓబులాపురం దేవానంద్ రెడ్డి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని ఓబులాపురం దేవానంద్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
