కలిగిరి అక్టోబర్ 1 :(మన ధ్యాస న్యూస్ ):////

కలిగిరి మండలం, చీమల వారి పాలెం గ్రామానికి చెందిన చీమల రాగయ్య – ఈశ్వరమ్మ గారి కుమారుడు రవీంద్ర వివాహ వేడుకలు ఆనందభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా జరిగిన నలుగు కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ , మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి ప్రత్యేక అతిథిలుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెళ్లికుమారుడు రవీంద్రను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *