మన ధ్యాస,నిజాంసాగర్,( నారాయణఖేడ్ ) నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని సత్య సాయి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ప్రతి రోజు అమ్మవారు భిన్నభిన్న అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.ఈ సందర్భంగా ఏడవ రోజు మహా చండీ దేవి రూపంలో అలంకరించబడిన అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ శెట్కార్ తన సతీమణి ఉమాదేవి శెట్కార్ తో కలిసి కట్ట మైసమ్మ ఆలయానికి విచ్చేశారు.దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఒడిబియ్యం,పట్టు వస్త్రాలను సమర్పించారు.
మాజీ జడ్పీటీసీ సంగీత జిత్తు శెట్కార్ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ తరఫున అధ్యక్షుడు ప్రభాకర్ సభ్యులు ఎంపీ దంపతులను ఘనంగా శాలువా కప్పి సన్మానించారు.ఎంపీ మాట్లాడుతూ – నవరాత్రులు స్త్రీ శక్తి వైభవాన్ని చాటి చెప్పే ఉత్సవాలని, సమాజంలో ధర్మం, న్యాయం నిలదొక్కుకోవడానికి దుర్గామాత రూపంలో దేవి శక్తి ప్రతిఫలిస్తుందని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు ప్రజలలో ఐక్యత, ఆధ్యాత్మికత పెంపొందిస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు శంకరయస్వామి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్, మైపాల్ రెడ్డి,నర్సింలు షెట్, రామ్ పటేల్,లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *