సంగం, సెప్టెంబర్ 27 (మన ధ్యాస న్యూస్)నాగరాజు: ////

నెల్లూరు జిల్లా సంగం మండలం చెన్నారపాలెం
పూరి గుడిసె ప్రమాదశాత్తు కరెంటు షార్ట్ తో రాగి తేజ,ఇల్లు కాలి బూడిద అయ్యింది, ఇతనకు భార్య కవిత ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆ ఇంటి లో ఉన్న బ్యాంకు పాస్ బుక్ సామానులు ఎలక్ట్రిక్ సంబంధించినవి పాత్రలు మంచాలు బ్రతుకు జీవనం కోసం ఆటో తీసుకోవాలని అప్పు తెచ్చుకున్న కొంత మొత్తం డబ్బులు కొంత బంగారం ఆ గుడిసెలో ఉన్న సామానులు మొత్తం పూర్తిగా కాలి బూడిదైపోయినాయి. దీనితో సర్వం కోల్పోయిన బాధితులను పటేల్ నగర్ యానాది మహానాడు సభ్యులు పరామర్శించి నెల్లూరు జిల్లా అధ్యక్షులు చౌటూరు మురళి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్లూరు ఆలేష మాట్లాడుతూ బాధితులకు నిత్యవసర సరుకులు కూరగాయలు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే స్థానిక మండల ఎమ్మార్వో ని కలిసి బాధితులకు వెంటనే ప్రభుత్వ ఆర్థిక సాయం అన్ని విధాలుగా ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని కోరగా స్థానిక ఎమ్మార్వో, విఆర్ఓ,ని సంఘటన జరిగిన స్థలానికి పంపించి బాధితులకు జరిగిన నష్టపరిహారం కోసం విచారణ జరపమన్నారు అని అన్నారు. స్థానిక ఎమ్మార్వో బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించారు. అలాగే నష్టపరిహారం కోసం జిల్లా కలెక్టర్ గారికి తెలియపరుస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *