మన న్యూస్ నెల్లూరు జిల్లా ఉదయగిరి : సెప్టెంబర్ 21:///

ఉదయగిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు సిబ్బంది నిర్లక్ష్యం వలనే తన బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆవేదన….

ఉదయగిరి మండల కేంద్రమైన ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది సకాలంలో స్పందించక ఓ పేదింటి తల్లి తన పండింటి మొగ బిడ్డని కోల్పోయినది. హాస్పిటల్ సిబ్బంది సరిగా విడుదల నిర్వహించి ఉంటే నా బిడ్డ చనిపోయేవాడు కాదని తల్లిదండ్రులు బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అని ఓ తల్లి ఆవేదన, నా బిడ్డ చావుకు కారణమైన డాక్టర్ను సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వాపోతున్నారు.కన్నీరు మున్నీరు అవ్వుతున్న ఆ తల్లి, తండ్రి,లు. అనంతరం వారి కుటుంబ సభ్యులు ధర్నాకి దిగారు. మా బిడ్డకు జరిగినట్టుగా ఇంకో తల్లి ఇంకో బిడ్డను పోగొట్టుకోకుండా ఉండేలా ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు,, కుటుంబ సభ్యులు దుఃఖం తో మునిగిపోతున్నారు. అనంతరం ఉదయగిరి పోలీస్ స్టేటస్ కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *