
మన ధ్యాస,నిజాంసాగర్ ( జుక్కల్ ) మహ్మద్ నగర్, సెప్టెంబర్ 19:మండలంలోని గాలిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ ఎం,ఇంఛార్జి ఎంఈవోగా విధులు నిర్వహిస్తున్న అమర్‌సింగ్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. పదవి విరమణను పురస్కరించుకుని మండల ఉపాధ్యాయులు శుక్రవారం మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్ లో ఘనంగా వీడ్కోలు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎంఈవో అమర్ సింగ్ కు ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, పీఆర్‌టీయూ నాయకులు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ— అమర్‌సింగ్ తన 30 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నోమంది విద్యార్థులను సమాజానికి ఉపయోగకరమైన పౌరులుగా తీర్చిదిద్దారని,నిజాయితీ, క్రమశిక్షణ,కృషి, కర్తవ్యనిర్వహణలో అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.
డీఈవో రాజు మాట్లాడుతూ— అమర్‌సింగ్ తన ఉద్యోగ జీవితమంతా విద్యా రంగానికి అంకితం చేశారని, ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను చూపడంలోముందుండేవారని తెలిపారు.మహ్మద్‌నగర్ మండలానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.నిజాంసాగర్ ఎంఈవో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ— అమర్‌సింగ్ పదవీ విరమణ తర్వాత కూడా ఉపాధ్యాయులకు మార్గదర్శకుడిగా ఉండాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు కావలసిన పనులు సమస్యలపై ఎప్పుడు తిరిగి పనులను ఎప్పటికప్పుడు చక్కబట్టే వారని పేర్కొన్నారు.
నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాట్లాడుతూ- ఉపాధ్యాయులు ఏమి వృత్తిలో కూడా అమర్ సింగ్ చేసిన సేవలను మరువలేమని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు ఏవైనా వస్తే ముందుండి నడిపించి వ్యక్తి అమర్ సింగ్ అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు కుషాల్, పిఆర్టియు మండల అధ్యక్షులు వెంకట రమణ, ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, ఉపాధ్యాయులు సంతోష్,నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,నాయకులు లోక్య నాయక్, పట్లోళ్ల దుర్గ రెడ్డి,అచ్చంపేట్ సింగల్ విండో చైర్మన్ నరసింహారెడ్డి,రమేష్ గౌడ్,తదితరులు ఉన్నారు


