

మన న్యూస్: పినపాక మండలం లోని విప్పలగుంపు గ్రామ యువకులకు మంగళవారం ఏడుళ బయ్యారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజకుమార్ చేతులు మీదుగా వాలీబాల్ కిట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, క్రీడలతోపాటు, చదువులోనూ రాణించాలన్నారు. ఎస్సై రాజ్ కుమార్ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసాని కలిగిస్తాయన్నారు.. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు.