

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనులు, సమస్యల పైన సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో సీఎం క్యాంపు కార్యాలయం నందు సీఎం రేవంత్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి గద్వాల నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న వారి సమస్యల పైన సీఎం దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది.ప్రధానంగా నెట్టెంపాడు గ్రామానికి సంబంధించిన షిఫ్ట్ ఇన్ చార్జీలను త్వరగా విడుదల చేయాలని కోరారు. గ్రామంలోని కొంతమందికి షిఫ్ట్ ఇన్ చార్జీలను రాలేదు వారికి త్వరగా షిప్పింగ్ చార్జి విడుదల చేసి ఆర్ అండ్ ఆర్ సెంటర్ లోని వారికి అన్ని వసతులతో గృహమును నిర్మించుకునే విధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని సీఎం కోరడం జరిగింది.అదేవిధంగా గద్వాల నియోజకవర్గం ప్రజలు వివిధ రకాల అనారోగ్యాలతో ఆసుపత్రిలో చికిత్సను పొందిన వారు సీఎం సహాయ నిధికి నమోదు చేసుకున్నప్పుడు గద్వాలకు అతి సమీపమైన ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూల్, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు ప్రాంతంలో చికిత్స పొందిన వారికి కూడా సీఎం సహాయనిధిలో అవకాశం కల్పించి సీఎం సహాయనిధి నుండి సహాయం పొందే విధం