సంక్షేమానికి పెద్ద పీఠ ఆడపిల్లలను చదివిద్దాం.. రక్షిద్దాం ఐ సి డి ఎస్ పి డి ఎం ఎన్ రాణి

మన న్యూస్: పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో కిషోర్ బాలికల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం తో పాటు వారి చదువుకు పెద్దపీట వేస్తోందని పార్వతిపురం మన్యం జిల్లా ఐ సి డి ఎస్ పిడి ఎం ఎన్ రాణి పేర్కొన్నారు.పాచిపెంట మండల పరిషత్ సమావేశ భవనంలో మంగళవారం నాడు కిషోర్ వికాసం శిక్షణ శిబిరంలో ఆమె మాట్లాడారు. శిక్షణ శిబిరం సిడిపిఓ అనంతలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.ముందుగా శిక్షకులకు( సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, అంగన్వాడి కార్యకర్తలు )శిక్షణ ఏర్పాటు చేశారు. ముందుగా వీరికి శిక్షణ కల్పించి వీరంతా రేపటి నుంచి ఆయా సచివాలయాలు పరిధిలో 11 నుంచి 18 సంవత్సరాల వయసులోపు డ్రాప్ ఔట్స్ ను సేకరించి అధికారులకు నివేదిక సమర్పిస్తారు. వారికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పిడి ఎంఎన్ రాణి మాట్లాడుతూ 11 నుంచి 18 సంవత్సరాల వయసు లోపు బాలికలు చదువుతున్నారా..?లేదా..?అలాగే వారికి పోషకాహారం అందుతుందా లేదా..? ఆరోగ్యవంతంగా ఉన్నారా వారికి సరిపడ పోషకాహారం కల్పించే విధంగా మండల అధికారులకు తెలియజేయడం గురించి మీకు శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా బాల్యవవాహాలు అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అందులో ఐసిడిఎస్, పోలీస్ పాత్ర గురించి వివరించారు. పి ఓ అనంతలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాలు లోపు ఆడపిల్లలకు పెళ్లి చేస్తే తల్లికి పిల్లకి నష్టం కలుగుతుందనితెలియజేశారు.ముఖ్యంగా మీరు చేసే సర్వేలో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు.ఆడపిల్లభేటీ బచావో.. బేటి పడావో ఆడపిల్లలను రక్షిద్దాం ఆడపిల్లలను చదివిద్దాం అని తెలిపారు. నీడ్ స్వచ్ఛంద సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ బాలికల హక్కుల గురించి టీం ల మహిళలు కు తెలియజేశారు. ముఖ్యంగా గుడ్ టచ్ అండ్ బ్యాడ్ గురించి అవగాహన కల్పించారు. కష్టం,ఆపద సమయంలో మగవారి నుంచి ఎలాంటి రక్షణ అవసరమో వివరించారు. అంతేకాకుండా పోషణ, ఆరోగ్యము విద్య అభివృద్ధి గురించి మహిళపోలీసులకు విశదీకరించారు. బాల్యవివాహాలు అరికట్టడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. బాల్య వివాహాలు చేస్తే చట్టరీత్యా నేరమని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంగన్వాడి కేంద్రాలకు వస్తున్న బాలింతలు గర్భిణీలు చిన్నపిల్లలు తీసుకోవలసిన ఆహారం, పోషణ గురించి మరొక సారి పి ఓ అనంతలక్ష్మి తెలియజేశారు. ప్రతిరోజు అంగన్వాడి సెంటర్లకు హాజరై ప్రభుత్వం అందిస్తున్న పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకొని ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.మండల విద్యాశాఖ అధికారి పల్లి జోగారావు కిశోర్ బాలికల గురించి వారిజాగ్రత్త గురించి అవగాహన కల్పించారు. అలాగే ఎంపీటీసీ డి కొండలరావు, పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, తదితరులు హాజరయ్యారు.

{“remix_data”:[],”remix_entry_point”:”challenges”,”source_tags”:[“local”],”origin”:”unknown”,”total_draw_time”:0,”total_draw_actions”:0,”layers_used”:0,”brushes_used”:0,”photos_added”:0,”total_editor_actions”:{},”tools_used”:{“transform”:1},”is_sticker”:false,”edited_since_last_sticker_save”:true,”containsFTESticker”:false}
  • Related Posts

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్‌ 18 : భక్తులకు దేవాదాయశాఖపై నమ్మకం భగవంతునిపై ప్రగాఢ విశ్వాసం కలిగించేలా దేవాదాయశాఖ అధికారులందరూ భగవంతుని సేవలో చిత్తశుద్ధితో పనిచేస్తూ, ఆలయాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.మంగళవారం ఉదయం…

    నెల్లూరులో వైభవంగా కాప్స్ రాక్స్ కార్తీక మాస వనభోజనాలు

    మన ధ్యాస ,నెల్లూరు, నవంబర్ 16:నెల్లూరులో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతిష్టాత్మకంగా కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్లో జరుగుతున్న వనభోజనాల కార్యక్రమం ఆదివారం బలిజ భవన్లో వైభవంగా జరిగింది. ముఖ్య అతిథులుగా మున్సిపల్ శాఖా మంత్రి పొంగూరు నారాయణ ,వారి సతీమణి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    • By RAHEEM
    • November 18, 2025
    • 2 views
    విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అండగా ఉంది – ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    తాటికొండ నవీన్ ఆధ్వర్యంలో రక్త నమూనా నిర్ధారణ పరీక్షలు..!!

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    భక్తులకు దేవదయ శాఖ పై నమ్మకం కలిగించే ఆలయాల అభివృద్ధికి కృషి చేయండి….. రాష్ట్ర ధర్మాదాయ, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    కావలి కాలువకు సోమశిల జలాలను విడుదల చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , కావ్య కృష్ణారెడ్డి ..!

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    శివ పార్వతి ల కళ్యాణమహోత్సవం లో పాల్గొన్న టీటీడీ చెర్మెన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు,,,

    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్

    • By RAHEEM
    • November 17, 2025
    • 7 views
    మూడు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత… కేసు నమోదు – ఎస్‌ఐ శివకుమార్