మన ధ్యాస,నిజాంసాగర్,(జుక్కల్ ) ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో
అధికారులు ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రాజెక్టును పరిశీలించి అధికారులు అప్రమత్తంగా ఉండాలని,లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేశారు..అనంతరం నియోజకవర్గంలోని ముంపు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు.నిజాంసాగర్
మండలంలోని బొగ్గు గుడిసె గ్రామంలో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించి ప్రజలను అప్రమత్తం చేశారు.ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.మహమ్మద్ నగర్
మండలంలోని తున్కిపల్లి గ్రామం రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చుట్టు ముట్టిన నీటితో ముంపునకు గురైంది.. ఈ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి ,జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గదృష్టికి తీసుకెళ్లగానే, ఎమ్మెల్యే గ్రామ ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. రోడ్లు దెబ్బతిన్నా,నీటి ప్రవాహంతో రాకపోకలు నిలిచినా,వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా,స్వంత కారుని వదిలి,సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాక్టర్‌లో సహసోపేతంగా ప్రయాణించి గ్రామంలోకి చేరుకొని ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్లి వారి పరిస్థితితెలుసుకున్నారు,అప్రమత్తంగా ఉండాలని సూచించారు,అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు .వెంటనే గ్రామంలో పోలీసు,ఆరోగ్య,రెవెన్యూ అధికారులను అందుబాటులో ఉంచి,అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు.
వరదల సమయంలో ప్రజల రక్షణ కోసం తక్షణమే స్పందించి,స్వయంగా తానే ముందుకు వచ్చి క్షేత్ర స్థాయిలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎమ్మెల్యే వెంట పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్, నిజాంసాగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *