మహిళ సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ ………నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మహిళా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ……….. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి- మహిళా సాధికారత.. స్త్రీ శక్తితో సాకారం.- కోవూరులో వేడుకగా స్త్రీ శక్తి విజయోత్సవ సభ .- భారీగా తరలివచ్చిన మహిళా. గణం.. కిక్కిరిసిన సభా ప్రాంగణం- సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ నినాదాలు.- మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఎం ఎస్ ఎం ఈ కంపెనీల ఏర్పాటుకు సహకరిస్తా .- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి చేతిలో కోవూరు నియోజకవర్గం పదిలం – ఎంపీ.- మన ఇంటి పెద్దన్న సీఎం చంద్రబాబు .- ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చరిత్ర మనది.- తాత ఎన్టీఆర్ భావజాలాలను ముందుకు తీసుకెళ్తున్నారు లోకేష్ – ఎమ్మెల్యే.మన ధ్యాస ,కోవూరు, ఆగస్టు 25:సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అన్న నినాదాలు హోరెత్తాయి తరలివచ్చిన మహిళాగణంతో కోవూరు వీధులు కిక్కిరిశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళా సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై ఆనందహేళి వెల్లివిరిసింది. కోవూరులోని తాసిల్దారు కార్యాలయ ఆవరణలో దాదాపు 5వేల మంది మహిళామణుల సమక్షంలో సోమవారం జరిగిన స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఆధ్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ,కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతులు హాజరుకాగా మహిళలు వారికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. అనంతరం వేదిక వద్దకు చేరుకున్న వేమిరెడ్డి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు పాలనలో జరిగిన లబ్ధిని వివరిస్తూ మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పలువురు మహిళలతో ముచ్చటించి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ…….. సీఎం చంద్రబాబు మహిళా సాధికారత ఎలక్షంగా మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళా శక్తికి నిదర్శనమే ప్రశాంతిరెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమని ఉద్ఘాటించారు. చంద్రబాబు అవకాశం ఇవ్వడం వల్లే ప్రశాంతి రెడ్డి ఎమ్మెల్యేగా తాను ఎంపీగా ఇక్కడ ఉన్నామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నిత్యం కోవూరు ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మహిళలకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 10 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని, దీని ద్వారా రూ. 3.7 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నారని, మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను కూడా తీసుకువచ్చారన్నారు. డ్వాక్రా మహిళలకు(సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్) వడ్డీ లేని రుణాలు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిందని గుర్తు చేశారు. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం కార్యక్రమం కింద అకౌంట్లో 15000 జమ చేశారని, ప్రతి నెల ఒకటవ తేదీన ఇంటింటికి పెన్షన్ అందజేస్తూ ఆదుకుంటున్నారన్నారు.ఎం ఎస్ ఎం ఈ కింద పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తా.జిల్లాలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ఎంపీగా తనవంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఎవరైనా మహిళలు మంచి ఆలోచనలతో ముందుకు వస్తే ఎంఎస్ఎంఈ కింద పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా తగిన సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ముందుకు రావాలని, అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ………. మహిళా సంక్షేమానికి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అని, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పాలన నుంచి నేటి వరకు మహిళాభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారన్నారు. యువ నాయకులు మంత్రి నారా లోకేష్‌ ఆలోచనల నుంచి రూపొందించిన సంక్షేమ కార్యక్రమమే స్త్రీ శక్తి పథకమన్నారు. ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం అని ఎలా గుర్తుంటుందో అదే రోజు రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన స్త్రీ శక్తి పధకం కూడా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కానుకగా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలతో పాటు చదువుకునే విద్యార్థినులకు స్త్రీ శక్తి పధకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఉన్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని చాటి చెప్పేలా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే సూపర్ సిక్స్ లోని 90 శాతం పథకాలు అమలు చేశారన్నారు. వచ్చే మార్చినాటికి సొంత ఇళ్ళు లేని కుటుంబాలకు 10 లక్షల ఇళ్లు నిర్మించి అక్క చెల్లమ్మలకు కానుకగా ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టినట్టు ఆమె వెల్లడించారు. బాలికలను ఉన్నత చదువులు చదివించాలనుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల ఆర్ధిక భారం తగ్గించడంలో తల్లికి వందనం దోహదపడుతుందన్నారు. దీపం- 2 పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందచేస్తూ లక్షలాది పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్ధికంగా చేయూతనిస్తున్నారన్నారు. ఇంటికి పెద్ద కొడుకులా మహిళా సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని మనసారా ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఆమె మహిళలను కోరారు.త్వరలోనే విపిఆర్ నేత్ర ప్రారంభం.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ప్రారంభించబోతున్నామని చెప్పారు. ఇప్పటికే క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా మహిళలకు క్యాన్సర్ పరీక్షలు చేయించామని, విపిఆర్ నేత్ర ద్వారా కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. పలువురికి ఘన సత్కారం.ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన పలువురు మహిళలను ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ఘనంగా సత్కరించారు. టీడీపీ నాయకురాలు, మాజీ ఎంపీపీ యాకసిరి వెంకటరమణమ్మ, పారిశుద్ధ్య కార్మికురాలు బండి విజయలక్ష్మి, సంఘ సేవకురాలు కె.సుభద్రమ్మ, సంఘమిత్ర పొదుపు సంఘ అధ్యక్షురాలు సిహెచ్ రమ్య, డీఎస్సీ లో 4 జాబ్స్ సాధించిన దాసరి ద్వివర్ణ లక్ష్మి, ఆశా వర్కర్ దార్ల కామేశ్వరమ్మ సన్మానం అందుకున్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు