


మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )
నిజాంసాగర్ మండల కేంద్రంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలోని పలు కార్యాలయాలు, సంస్థల్లో జాతీయ పతాకారోహణ కార్యక్రమాలు జాతీయ భావోద్వేగంతో సాగాయి.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏలే మల్లికార్జున్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ బిక్షపతి, ఎంపీడీవో కార్యాలయంలో గంగాధర్, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ శివకుమార్,మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ తిరుపతిరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారి రోహిత్‌కుమార్ జాతీయ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ,దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.

