నిజాంసాగర్​ ప్రాజెక్టు లో 1393 అడుగులు చేరిన నీటిమట్టం. సింగూరు ప్రాజెక్టు 1 గేటు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ ప్రాజెక్టు కు ఇన్​ఫ్లో కొనసాగుతోంది.ఎగువన గల సింగూరు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది.నిజాంసాగర్​ జలాశయంలోకి ప్రస్తుతం 2334 క్యూసెక్కుల నీరు ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405 అడుగులు 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1393.33 అడుగుల 5.863 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని కళ్యాణి రిజర్వాయర్​లోకి 230 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటిమట్టం 409.50 మీటర్లకు గాను 408.50 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. అలాగే సింగితం రిజర్వాయర్​లో 416.554 మీటర్లకు గాను 415.504 మీటర్ల మేర నీరు ఉంది. సింగూరు నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
నిజాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువన గల సింగూరు ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. మంజీర పరీవాహక ప్రాంతంలోని సంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్​ఫ్లో వస్తుండడంతో ఒక వరద గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఈ ప్రాజెక్టులో గురువారం సాయంత్రానికి 523.600 మీటర్లకు 29.917 టీఎంసీలు గాను 522.110 మీటర్లు 22.145 టీఎంసీలనీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 2,941 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండడంతో 11 నంబర్ గేటు ద్వారా 10,719 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేస్తున్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు