

- తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి సుభాష్…
- వజ్రకూటం లో పద్మావతి కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరం…
శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:-
దివంగత ప్రజానేత స్వర్గీయ వరుపుల రాజా 50వ జయంతిని పురస్కరించుకొని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం వజ్రకూటం గ్రామంలో తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో కత్తిపూడి పద్మావతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సందర్భంగా తెలుగు యువత అధ్యక్షులు గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి సుభాష్ మాట్లాడుతూ, దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎనలేని సేవలందించారని, నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యమే శ్రేయస్సుగా భావించి అనేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం అందించే వారిని గుర్తు చేశారు. రాజన్న ఆశయాల ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ప్రజలకు సేవలందిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. అనంతరం కంటి వైద్యులు కొంగు రమేష్ మాట్లాడుతూ, కంటి వైద్య శిబిరానికి గ్రామంలో గల 100 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, వారిలో కంటి ఆపరేషన్లు కొరకు 15 మందిని గుర్తించి త్వరలో ఆపరేషన్లు చేయించడం జరుగుతుందన్నారు. అనంతరం కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కత్తిపూడి జార్జి చిన్నపిల్లల ఆసుపత్రి పక్కన పద్మావతి కంటి ఆసుపత్రిని సంప్రదించాలని కోరారు. తక్కువ ధరలకే పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు చేయబడునని తెలిపారు. ఈ కంటి వైద్య శిబిరంలో వైద్యులు ఎస్. రాజు, గునపర్తి సునీల్ కుమార్, కె . నాగేంద్ర, సభ్యులు పాల్గొన్నారు.