

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి:-
మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలకు సేవలు అందించాలని ఉత్తరకంచి గ్రామంలో సాయినాధుని వైసిపి నాయకులు ముద్రగడ అభిమానులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ రామిశెట్టి నాని మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంపీగా పదవులు చేసినప్పుడు ప్రత్తిపాడు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. అటువంటి నాయకుడు త్వరగా కోలుకొని ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డు చిన్నా, కందా మాణిక్యం, రామిశెట్టి త్రిమూర్తులు,బొరుసు ప్రకాశం, అనుబోలు ఆదినారాయణ, నెల్లిపూడి దొంగయ్య, రామిశెట్టి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు