

మన న్యూస్,నిజాంసాగర్ 🙁 జుక్కల్ ) పేద ప్రజలు అనారోగ్యానికి గురైతే ఆపద
సమయంలో సీఎం సహాయనిధి పథకం ద్వారా లబ్ది పొందు తూ మెరుగైన వైద్యం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడు తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలే.మల్లికార్జున్ అన్నారు.మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన లబ్ధి దారులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే. మల్లికార్జున్ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అనీస్,పండరి, రాజారాం, అబ్దుల్ జమీల్, అజారుద్దీన్, రాము రాథోడ్, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

