

శంఖవరం/ ప్రత్తిపాడు మనన్యూస్ ప్రతినిధి:- మాజీ మంత్రి వైసీపీ పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకోవాలని కిర్లంపూడి గ్రామం లో సంత మార్కెట్ లో ఉన్న వినాయకుడు దేవాలయం లో వర్తక సంఘం ఏర్పాటు చేసిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో ముద్రగడ సతీమణి ముద్రగడ పద్మావతి పాల్గొని తన భర్త ముద్రగడ పద్మనాభం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని పూజలు నిర్వహించారు. ముద్రగడ సతీమణి పద్మావతికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తన భర్త సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని దీవించారు. ముద్రగడ సతీమణి ముద్రగడ పద్మావతి మాట్లాడుతూ తన భర్త ఆరోగ్యం కోసం దేవాలయాల్లో, చర్చ్ ల్లో మసీదుల్లో, పూజలు ప్రార్థనలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. భగవంతుణ్ణి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో నా భర్త సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.