విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

మన న్యూస్: సుజాతనగర్ వేపలగడ్డలోని వెనుకబడిన తరగతుల బాలుర గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యాలయ ప్రాంగణం, వంటగదులు, విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. కలిగే ఇతర ఇబ్బందులను గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తాత్కాలిక భవనంలో గురుకుల విద్యాలయాన్ని ఏర్పాటు చేశామని పక్కా గృహం చేపట్టాలని కలెక్టర్ కు తెలుపగా వారం రోజుల్లో గురుకుల విద్యాలయానికి బిల్డింగ్ తోపాటు కావలసిన ఇతర సదుపాయాల ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని సూచించారు. పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం సుజాతనగర్ లోని జిన్నింగ్ మిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పత్తిలో తేమశాతం,రేటు వంటి కొనుగోలు విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అధికారులు సమకూరుస్తున్న వసతులను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు, గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ బ్యూలారాణి, ఏవో నర్మద, రైతులు పాల్గొన్నారు…

  • Related Posts

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    మన ధ్యాస నారాయణ పేట జిల్లా: ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైర్హాజరు అయిన 74 మంది ఎన్నికల సిబ్బందికి గురువారం షోకాస్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం జరిగిన…

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: ఎన్నికల ప్రక్రియ మొత్తం మూడు దశలు పూర్తిగా ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) పూర్తి స్థాయిలో అమల్లోనే ఉంటుందని నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు.మొదటి దశలో నారాయణపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేతుల మీదుగా 74 మందిలబ్ధి దారులుకు సీఎం ఆర్ ఎఫ్, చెక్కుల పంపిణీ.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    మేకపాటి శాంత కుమారి కి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం,74 మందికి  షోకాజ్ నోటీసులు జారీ చేసిన  జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం: ఎస్పీ డాక్టర్ వినీత్.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    పంచాయతీ ఎన్నికల బందోబస్తు నిర్వహణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.

    ఎలక్షన్ సరళి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన: జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్.