మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయితీ 11వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు.ఈ సందర్బంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు అలమండ చలమయ్య,బొదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఇంటింటికీ తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలిసుకున్నారు.పట్టణ కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి,మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ గొడత చంద్రమ్మ కుటుంబ సభ్యులు గొడత విజయజానకి రాజబాబులతో పాటు సుమారు 100 మందికి పైగా టీడీపీలో చేరారు.వారికి ఎమ్మెల్యే సత్యప్రభ పార్టీ కండువాలు వేసి టిడిపిలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు,యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు.అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే మీడియాతో అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిబిఎన్ ఆర్మీ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్,నియోజకవర్గ పరిశీలికులు మెట్ల రమణబాబు,ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి,బద్ది రామారావు,కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు,కోణాల వెంకటరమణ,పెండ్ర శ్రీను,ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్,వైస్ చైర్మన్లు వాగు రాజేష్,జొన్నాడ వీరబాబు,నాయకులు బుద్ధ సూర్యప్రకాష్,పసల సూరిబాబు,బస్సా ప్రసాద్,మైరాల కనకారావు,అనంతారపు రాజు,రుచి రమేష్,ఇళ్ల అప్పారావు,బ్యాంకు రాజు,పలివెల శ్రీనివాస్,కోరుకొండ నూకరాజు తదితరులు పాల్గొన్నారు

By DURGASRINIVAS

Good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *