

మన న్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలం, ఎర్రవల్లి మండలం పుటాందొడ్డి గ్రామ శివారులో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుటాన్ దొడ్డి గ్రామానికి చెందిన బోయ రాజేష్ గారు తన ఎద్దుల బండితో పొలానికి వెళ్తుండగా గద్వాల్ డిపో కి చెందిన బస్సు ఎద్దుల బండిని ఎదురుగా ఢీకొట్టడంతో ఒక ఎద్దు అక్కడికక్కడే మరణించింది. ఎద్దుల బండి పూర్తిగా డామేజ్ దెబ్బతింది. మనుషులకు ఎవరికి ఎలాంటి అపాయం జరగలేదు.