విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి

మన న్యూస్: విద్యుత్ సంస్థల్లోని కార్మికుల విభాగంలో శాంక్షన్ పోస్ట్లు మంజూరు చేయాలని టి ఎస్ పి ఈ యు -1535 సెంట్రల్ కమిటీ అధ్యక్షులు ఎంఏ వజీర్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత వల్ల ప్రస్తుతం ఉన్న కార్మికుల మీద పని భారం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1535 కేంద్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ నుండి యూనియన్ శాఖల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పెండింగ్ లో ఉన్న డి ఎ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు యూనియన్ సంస్థాగత అంశాలపై మాట్లాడుతూ నూతన కమిటీ లో ప్రతిభావంతమైన నాయకులకు పదవులు కట్టబెట్టి ప్రతిభను ప్రోత్సహిస్తామని చెప్పారు.కార్మిక సంక్షేమానికి అలుపెరుగని పోరాటం చేస్తున్న యూనియన్ తమదేనని కొనియాడారు. కార్మిక సమస్యలపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో యూనియన్ సభ్యత్వం పెంచేందుకు కృషి చేయాలని చెప్పారు. వచ్చే ఏడాది నూతన సంవత్సర డైరీ ని,క్యాలెండర్ ఆవిష్కరణల పై చర్చ జరిగింది.యూనియన్ సెంట్రల్ ప్రధాన కార్యదర్శి డి. రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జెనకో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి పి.రాము, జి. కుమారస్వామి ఎన్పీడీసీఎల్ అధ్యక్ష కార్యదర్శులు బుడిగ శ్రీను, మూర్తి,సెంట్రల్ కమిటీ కోశాధికారి పుట్ట నాగేశ్వరరావు , నాయకులు తుంపూరివిజయ్,ఎండి. గౌసిద్దీన్, ఎం.శ్రీధర్, దానం నరసింహారావు, వల్లమళ్ల ప్రకాష్, అంబాల శ్రీను, అక్కెనపల్లి వెంకటేశ్వర్లు, అల్లాడి పుల్లారావు, వెలదండి ప్రసాద్,ఆర్. రామచందర్,సిద్ధులు హుస్సేన్, ఏ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..