

మన న్యూస్: బాల్యవివాహాలను నిర్మూలించాలంటే సామాజిక భాగస్వామ్యం ఎంతో కీలకమని అందుకు అందరం కలిసి బాల్యవివాహాలను చేయము ప్రోత్సహించము అని ప్రతిజ్ఞ కోణాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు
యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ ఆలయన్స్ ఆధ్వర్యంలో స్థానిక కేజీబీవీ పాల్వంచ నందు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా బాల్య వివాహల నిర్మూలనకై అన్ని జిల్లాల్లో ఒకేసారి ప్రతిజ్ఞ చేస్తున్నారని ఇది బాలల యొక్క భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు బాల్య వివాహాలు అనేవి ఒక సామాజిక దురాచారం అని అనదిగా కొనసాగుతున్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని అందరం కలిసి సమూలంగా నిర్మూలించాలని బాల్య వివాహం అనేదే లేని సూర్యపేటకై నిరంతరం శ్రమించాలని కోరారు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాలలకు సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులోనే వివాహం చేయడం వల్ల బాలికలకు శారీరక మానసిక ఆరోగ్య రుగ్మతలు వస్తాయని సరైన పరిపక్వత లేక పుట్టే పిల్లలు కూడా అనేక రకాల లోపాలతో పుట్టడం వల్ల జీవితాంతం ఆ మనోవేదన అనుభవించాల్సి వస్తుందని కొన్ని సందర్భాలలో మాత శిశు మరణాలు కూడా జరుగుతాయని ఈ నష్టాల వలన స్త్రీ పురుష నిష్పత్తి కూడా గణనీయంగా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది అని ఆ ధర్మాన్ని కాపాడే సమయంలో ప్రభుత్వం అక్కడ ఉంటుందని బాల్య వ్యవహారాల నిర్మూలనలో కూడా పూర్తిస్థాయి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు బాలలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అందిస్తామని తెలిపారు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి గొల్లపూడి భానుమతి మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అనునిత్యం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని పారాలిగల్ వాలంటీర్ల ద్వారా బాలలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు తెలిపారు చిన్నపిల్లలకు మ్యారేజ్ చేస్తే పెళ్లి చేసిన వారికి పురోహితుడికి వచ్చిన బందు గణాల పై కేసు నమోదు అయితే రెండు సంవత్సరాల జైలు శిక్ష లక్ష రూపాయలు వరకు విధించవచ్చునని తెలిపారు. బాలలకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అందిస్తామని తెలిపారు. మనకు గర్ల్ చైల్డ్ బంగారం తో సమానము అని అన్నారు వారిని బంగారంలా చూసుకోవాలని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు అంబేద్కర్ మరియు సాదిక్ పాషా మాట్లాడుతూ బాల్య వివాహం అనేది చట్టరీత్యా నేరము దీనికి పాల్పడిన వారికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుంది అని తెలిపారు.అలాగే బాల్యవివాహాల వలన కలిగే నష్టాల గురించి బాలికలే కాకుండా బాలురకు కూడా అవగాహన కల్పించాలని తెలిపారు.
మరో అతిధి జిల్లా సంక్షేమ అధికారి లెనినా మాట్లాడుతూ సంక్షేమ శాఖ ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా బాల బాలికల శ్రేయస్సుకై అనేక రకాల కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు క్షేత్రస్థాయిలో బాల్య వివాహ నిరోధక అధికారులు నిరంతరం పనిచేస్తూ ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే వెళ్లి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ బాలలను వారి యొక్క విద్య కొనసాగేలా చూస్తున్నట్లు తెలిపారు.
జి సి డి ఓ అన్నామణి గారు మాట్లాడుతూ పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలని వ్యక్తిగత శుభ్రత పాటించాలని బాలికలు అందరూ చదువులలో మరియు ఆటలలో రాణించాలని నేటి బాలలే రేపటి పౌరులని మీ మేధస్సు దేశానికి ఎంతో అవసరం అని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరి కుమారి మాట్లాడుతూ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా బాలలకు అన్ని రకాల సేవలను అందిస్తున్నామని ఎవరైనా బాల్య వివాహం చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే 1098 కి ఫోన్ చేసి తెలపాలని కోరారు. బాల్య వివాహాలు లేని భద్రాద్రి కొత్తగూడెం కై ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో త్వరలోనే ఆ అక్కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిడ్ సంస్థ కోఆర్డినేటర్ రాజేష్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గత రెండున్నర సంవత్సరాలుగా బాల్య వివాహాల నిర్మూలనకు క్షేత్రస్థాయిలో నిత్యం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రులకు బాల బాలికలకు ప్రజలకు బాల్య వివాహాలు చేయడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ వారి పిల్లలు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఒక బాలి వివాహ నిరోధక అధికారిని ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అని కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి అన్నపూర్ణాదేవి కారు బాల్య వివాహ ముక్ట్ భారత్ అనే క్యాంపెయిన్ను ప్రారంభించినట్లు తెలిపారు అందులో భాగస్వాములు అవ్వడం ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు
అనంతరం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రతిజ్ఞ జరిగే సమయంలోనే బాల బాలికలు అందరి చేత కలెక్టర్ గారు బాల్య వివాహ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఏఐడీ సంస్థ కోఆర్డినేటర్ రాజేష్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యులు సాదిక్ పాషా, అంబేద్కర్,జిల్లా సంక్షేమ అధికారిని లెనిన్, జి సి డి ఓ అన్నామని, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న, డి సి పి ఓ హరి కుమారి, కేజీబీవీ ప్రత్యేక అధికారిని తులసి, సీనియర్ అడ్వకేట్ మెండు రాజమల్లు, ఏఐడీ కుటుంబరావు, శేఖర్, మోహన్, జ్యోతి, 1098 టీం, సఖి వన్ స్టాప్ సెంటర్ టీం, డిస్టిక్ హబ్ టీం, అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు