

మన న్యూస్: పినపాక మండల కేంద్రమైన పినపాక, గోపాలరావుపేట గ్రామాల మధ్య బుధవారం సాయంత్రం ఏడూల్ల బయ్యారం ఎస్సై రాజ్ కుమార్ వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులతో ఆయన మాట్లాడుతూ… డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురై మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు సరైన వాహన ధ్రువ పత్రాలు కలిగి ఉండాలని. అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా పరిశీలించారు.అంతేకాకుండా చలి తీవ్రత పెరగడం వల్ల వాహనదారులు దూరప్రాంతాలకు ప్రయాణించకూడదని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.