

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) పెద్ద కొడప్ గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళ వారం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటం ముందు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేశారు.ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల్ రాజ్ భారతరాజ్యాంగం విశిష్ఠతను వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి భూపల్లి ప్రదీప్,ఆరోగ్య ఉపకేంద్రం వైద్యులు డాక్టర్ సాయిబాబా,మొహిద్దిన్ పటేల్,రసూల్ పటేల్,ఇస్మాయిల్ పటేల్,యూసుఫ్ పటేల్, మొగులాగౌడ్, గంగగౌడ్ హాజి,చాంద్ పాషా,బాలరాజు,అశోక్,శ్రీను తదితరులు పాల్గోన్నారు