అధిక దిగుబడితో రైతులు సంతోషంగా ఉండాలి…….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్, విడవలూరు:- సీఎం చంద్రబాబు సారథ్యంలో అన్నదాతలకు లబ్ధి.- 24 గంటల్లోనే ధాన్యం అమ్మకాల నగదు జమ.- రైతుల తొలి పండుగ ఏరువాక పౌర్ణమి.నాగరికత ఎంత పెరిగినా.. నాగలి లేనిదే పని జరగదని, రైతు లేనిదే పూట గడవదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. విడవలూరు మండలం చౌకిచర్ల గ్రామంలో నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ప్రశాంతమ్మకు నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఎడ్ల బండిపై ఊరేగించుకుంటూ గ్రామానికి తీసుకువచ్చారు. అనంతరం వ్యవసాయ పనిముట్లకు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎడ్ల బండిపై ఎక్కి ఏరువాక ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ… వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి అని, డెల్టా ప్రాంతమైన కోవూరులో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఉందన్నారు. సాగునీరు రైతులకు సరిపడా ఉందని, ఈ ఏడు పంటలు బాగా పండాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, స్వర్ణాంధ్ర@2047 ద్వారా వ్యవసాయం, మత్స్యకార రంగం, రవాణా రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సహకారంతో విపిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పంట కాలువల్లో ఎక్కడికక్కడ పూడికలు తొలగించి రైతులకు మేలు చేశామన్నారు. ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే నగదు చెల్లించి రైతులను ఆదుకుందని చెప్పారు. రైతులకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తినా మంత్రుల దగ్గరి నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారని, ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంవత్సరం రైతులకు పంటలు బాగా పండాలని, అధిక దిగుబడులు రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత బెజవాడ వంశీ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కొమ్మి మురళీ రెడ్డి, అలగర వినోద్‌కుమార్‌, అశోక్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, సురేష్‌, ప్రభాకర్‌, విజయ్‌కుమార్‌, సుబ్బారెడ్డి, బీజేపీ నాయకులు రాఘవేంద్రరావు, కోటిరెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 7 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…