మన న్యూస్ ,నెల్లూరు: .ప్రజా నాయకులు మాజీ మంత్రివర్యులు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమం జూన్ 8 ,ఆదివారం ఉదయం 9:30 గంటలకు నెల్లూరు నగరం రామలింగాపురం “ఆనం వెంకట రెడ్డి సెంటర్” నందు విగ్రహ పునః ఆవిష్కరణ* కార్యక్రమం జరుగును. సింహపురి సేవాసమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించుటకు ఏర్పాటు చేయడమైనది. సదరు పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ఆనం కుటుంబ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నెల్లూరు నగర ప్రముఖులు, ఆత్మీయులు అందరూ పాల్గొనవలసినదిగా సాదర పూర్వకంగా ఆహ్వానించడమైనది అని సింహపురి సేవా సమితి మరియు ఆనం కుటుంబ సభ్యులు పత్రికా ప్రకటన తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *