మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి….. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్

*మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి.*అట్టహాసంగా వనమహోత్సవ కార్యక్రమాలు* అటవీ శాఖ ఆధ్వర్యంలో కోట మండలంలో ప్రపంచ పర్యావరణం దినోత్సవ వేడుకలు. చిట్టేడు లోని NIOTక్యాంపస్ నందు మొక్కలు నాటిన ఎమ్మెల్యే.* కోటలోని అల్లారెడ్డి వెంకట కృష్ణ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోప్రపంచ పర్యావరణం దినోత్సవ వేడుకలు.*ఎమ్మెల్యే కు అపూర్వ స్వాగతం పలికిన టిడిపి నాయకులు,అటవీ శాఖ అధికారులు. *వనసంరక్షణ సమితి సభ్యులతో కలసి ఉన్నత పాఠశాల ప్రాంగణం నందు మొక్కలు నాటిన ఎమ్మెల్యే. *కోట, వాకాడు, చిట్టమూరు మండలాలల్లో 2600 మంది వనసంరక్షణ సమితి సభ్యులు.*2600 మంది సభ్యులకు 2 కోట్ల 16 లక్షల 36 వేల రూపాయలు మంజూరు. *సభ్యులకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే *డాక్టర్ పాశిం సునీల్ కుమార్.వైసీపీ వెన్ను పోటు దినంగా చేయడం సిగ్గు చేటు:ఎమ్మెల్యేఅభివృద్ధి జరిగింది, జరుగుతుంది కేవలం టిడిపి ప్రభుత్వంలో మాత్రమే.*పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందనిపర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది:ఎమ్మెల్యే.*కేవలం మొక్కలు నాటి వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. *ఘనంగా వనమహోత్సవాలు.*పలుచోట్ల మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసిన అధికారులు, ప్రజలు.ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి:ఎమ్మెల్యే సూచన.*గ్రామాల్లో అటవీ సమస్యలకు పరిస్కారం చూపాలి:అటవీ అధికారులకు ఎమ్మెల్యే సూచనలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా జరిగాయి. అందులో భాగంగా గూడూరు డివిజన్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు గురువారం కోట మండలం లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గూడూరు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాల్గున్ని ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులుతో కలిసి మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు.ముందుగా కోట మండలం లోని చిట్టేడు గ్రామం లో ఉన్న NIOT క్యాంపు కార్యాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అక్కడ నుండి కోటలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ అధికారులు తో కలిసి మొక్కలు నాటారు. ఎమ్మెల్యే రాక ను పురస్కరించుకొని టిడిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు అపూర్వ స్వాగతం పలికి శాలువా లు కప్పి పుష్ప గుచ్చలు అందజేసి స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసి సభ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కేవలం మొక్కలు నాటి వదిలేయకుండా వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని అవగాహనకల్పించారు.రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కోట మండలం లో దాదాపు 2600 మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారనీ తెలిపారు. ప్రతి నీటి బొట్టును ఆదా చేసుకుందామని, ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేదిద్దామని ప్రతిజ్ఞ చేశారు. చెట్లను కుటుంబ సభ్యుల్లా సంరక్షించాలని పిలుపు నిచ్చారు.’హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములమౌదాం. సీఎం ఆదేశాలకు అనుగుణంగా హరితాంధ్రప్రదేశ్ సాధనలో భాగస్వాములవ్వాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు నియోజకవర్గంలో ఎన్డీయే నాయకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతి జిల్లా ల్లో గూడూరు నియోజకవర్గం లోప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా అటవీ శాఖ అధికారులు నిర్వహించడం చరిత్రలో ఇదే ప్రధమం అన్నారు.పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారా ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గూడూరు నియోజకవర్గం లో 36 శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి పెంచే లక్ష్యంతో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు.వనసంరక్షణ సమితి సభ్యులకు చెక్కులు పంపిణి చేశారు. కోట మండలం, కోట గ్రామం లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో 2600 మంది వనసంరక్షణ సమితి సభ్యులకు మంజూరు అయిన 2 కోట్ల 16 లక్షల 36 వేల రూపాయలు చెక్కులను ఎమ్మెల్యేడాక్టర్ పాశిం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు 1996 లో అటవీ శాఖ గ్రామాల్లో వన సంరక్షణ సమితి ఏర్పాటు చేసి అటవీ సంపదలో 50 శాతం ఇస్తూ జి వో ఇచ్చారు. నాటి కార్యక్రమం వల్ల నేడు వన సంరక్షణ సమితి సభ్యులకు కోట్లాది రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు.వెన్నుపోటు దినం’ అంటూ హేళన చేసిన టీడీపీ ఎమ్మెల్యే.జగన్ ఇంకా గుణపాఠం నేర్చుకోలేదన్నారు.అర్థరహిత’ నిరసనలకు బదులుగా, నిర్మాణాత్మక చర్చకు రావాలని వైఎస్‌ఆర్‌సిపినాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సవాలు విసరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సభ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ…..ఇటీవలి ఎన్నికల ఓటమి నుండి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏమీ నేర్చుకోనట్లు కనిపిస్తోందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు.ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ వెన్నుపోటు దినం ‘ పాటించాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ) ఆలోచనను అపహాస్యం చేస్తూ , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమి నుండి ఏమీ నేర్చుకోనట్లు కనిపిస్తోందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు.గత వారం రోజులుగా వైయస్ఆర్సిపి నాయకులు ‘వెన్నుపోటు దినం’ పేరుతో అనవసర నాటకం ఆడుతున్నారని సునీల్ కుమార్ ఆరోపించారు. ‘వెన్నుపోటు దినం’ వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటని వైయస్ఆర్సిపి నాయకులను కూడా ఆయన ప్రశ్నించారు. “మూడు రాజధానుల పేరుతో వైఎస్సార్‌సీపీ ఆపేసిన అమరావతి రాజధాని పనులను తిరిగి ప్రారంభించడమా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు సేకరించడమా లేక వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది వేయడానికి ప్రధానమంత్రిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమా?” అని ఆయన ప్రశ్నించారు.జగన్ అంటే వెన్నుపోటు రాజకీయాలకు పర్యాయపదమని టీడీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. గత ప్రభుత్వం పింఛన్లను కేవలం ₹1,000 పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని అన్నారు. మద్య నిషేధం, ఉద్యోగ క్యాలెండర్ విడుదల వంటి కొన్ని ప్రధాన వాగ్దానాలను నెరవేర్చడంలో YSRCP విఫలమైందని కూడా ఆయన ఆరోపించారు. గత ఏడాది కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం మెగా డీఎస్సీ నియామకాలు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, భూమి హక్కు చట్టం రద్దు, దీపం పథకం ద్వారా ఉచిత ఎల్పీజీ సిలిండర్ల పంపిణీ, పెన్షన్ల పెంపు వంటి అనేక ముఖ్యమైన హామీలను ఇప్పటికే అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలు తిరిగి తెరిచే ముందు జూన్ 12న ప్రభుత్వం ‘తల్లి కి వందనం’ పథకాన్ని ప్రారంభిస్తుందని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారని ఆయన పునరుద్ఘాటించారు.అనంతపురం పలువురు నాయుకులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయుకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, చిల్లకూరు దశ రధ రామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి,పాపా రెడ్డి పురుషోత్తం రెడ్డి, మండల అధ్యక్షులు మద్దాలి సర్వో త్తమ రెడ్డి, గణపర్తి కిషోర్ నాయుడు, దువ్వూరు మధు సుధన్ రెడ్డి, మరియు షేక్ జలిల్ అహ్మద్, పాదార్తి కోటా రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, వాకా భాస్కర్ రెడ్డి,కొకర్ల మధు యాదవ్, ఎంపిటిసి లు దార సురేష్,షేక్ షాంషుద్దీన్, తూపిలి రాధ కృష్ణా రెడ్డి, చంగళ రావు, మురళి, కోటి,సర్పంచ్ వెంకట రమణమ్మ, ఎస్టీ టిడిపి మహిళ అధ్యక్షరాలు పోలమ్మ, ఉప సర్పంచ్ గాది భాస్కర్, అటవీ శాఖ, రెవిన్యూ, మండల పరిషత్, పంచాయతీ అధికారులు, సిబ్బందిమరియు టిడిపి నాయుకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్ 12 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు పరచాలని రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్ డిమాండ్ చేశారు. ఈరోజు బీసీల 5 ప్రధాన డిమాండ్ల…

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    ఆర్థిక సాయం అందజేసిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ బోగినేని కాశీరావు….///

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    బీసీలకిచ్చిన ఎన్నికల వాగ్దానాలు అమలు పరచాలి:రాష్ట్ర జేఏసీ చైర్మన్ జ్ఞాన జగదీష్

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 4 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 8 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//