గూడూరులో ఎమ్మెల్సీ మేరిగా మురళి ఆధ్వర్యంలో “వెన్నుపోటు” దిన కార్యక్రమం

మన న్యూస్ ,గూడూరు: *అన్ని రంగాల్లోనూ ఘోర విఫలమైన కూటమి ప్రభుత్వం.*ఏడాది పాలనలో ‘0’ సంక్షేమం ‘0’ అభివృద్ధి ఈ ప్రభుత్వ ఘనత.*ఉన్న పథకాలు అటకెక్కాయి. చెప్పిన పథకాలు చందమామ కథలా మారాయి.*ఒకటిన్నర లక్ష కోట్లు అప్పుచేసి ఎక్కడ పెట్టారో సమాధానం ఏది.*గూడూరులో జరిగిన వెన్నుపోటు దినంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ.*అవినీతిని చట్టబద్ధత చేసేలా స్థానిక ఎమ్మెల్యే వైకిల్ పైన అసహనం.తిరుపతి జిల్లా గూడూరులో వెన్నుపోటు దినం సక్సెస్ అయింది. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వైసిపి శ్రేణులు స్థానిక ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి.. ఏడాది గడిచింది పథకాలు అమలు ఎక్కడ .? అంటూ వైసీపీ నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మీడియాతో మాట్లాడారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన ఘోరంగా విఫలమైనట్లు చెప్పారు. ఏడాది పాలనలో ‘0’ సంక్షేమం ‘0’ అభివృద్ధి అని విమర్శించారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇచ్చిన 143 హామీలు ఏ ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వివరించారు. నిరుద్యోగ భృతి, వసతి దీవెన, ఆడబిడ్డ నిధి, రైతు భరోసా, ఉచిత బస్సు ఇలా అనేక పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయని వైనాన్ని ఆయన వివరించారు. ఒక్క పిలుపుతో వెన్నుపోటు దినం విజయవంతం చేసేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన అనేక పథకాలను 100 అడుగులు ముందుకు వేసి మెరుగులు దిద్ది వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజాదరణ పొందిన అనేక పథకాలను కూటమి ప్రభుత్వం అటకెక్కించిందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వైఖరి పైన ఆసకహనం వ్యక్తం చేశారు. ఇటీవల స్పందన కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ రెవిన్యూ అధికారులకు అందరి ముందు లంచం ఇచ్చి అవినీతిని చట్టబద్ధత చేసే విధంగా వ్యవహరించిన తీరును తప్పుపడుతూ ఆ సందర్భాన్ని ఎమ్మెల్యే విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణంలో మరియూ అన్నీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాయకులు , తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…