నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

మన న్యూస్, నెల్లూరు రూరల్:రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి సంబరాలు చేసుకుంటుందని వైయస్ఆర్ సీపీ నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వెన్నుపోటు దినం’’ కార్యక్రమంలో బాగంగా నగరంలోని రైల్వేఫీడర్స్‌రోడ్డులోని వెటర్నరీ హాస్పిటల్‌ నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆర్‌డీఓ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ….ఏడాది కాలంలో ఒక్కహామీ కూడా నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని మండిపడ్డారు. వాలంటీర్‌లకు రూ.5వేలును రూ.10వేలు చేస్తామని వారిని నిర్దాక్ష్యణ్యంగా తొలగించారన్నారు. మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తామని ఆ ఊసేలేకుండా ప్రభుత్వం మిన్నకుండిపోయిందని తెలిపారు. ఇంటి వద్దకే వెళ్తున్న రేషన్‌ వాహనాలను నిలిపివేసి, నడిచివెళ్ళి రేషన్‌ సరుకులు తెచ్చుకోవాలని చెప్పడం దారుణమన్నారు. విధ్యార్దులకు రూ.15వేలు , మహిళలకు రూ.18వేలు ఇస్తామని, ప్రతి నెలా మహిళలకు రూ.15వందలు అకౌంట్‌లలో వేస్తామని భూటకపు హామీలు కురిపించి ప్రజలను చంద్రబాబునాయుడు మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు 20లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు నీటిమూటలుగా మిగిలిపోయాయని యద్దేవాచేశారు.ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్‌రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కువ శాతం ఏపీలో మహిళల పై అరాచకాలు జరిగాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ఉన్నామని మరిచి కక్షసాధింపులు, రాజకీయ కక్షలకు తెగబడుతున్నారన్నారు. రాష్ట్రంలో రాకీయ కక్షసాధింపు, రాజకీయ హత్యల కారణంగా 390 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చిన హామీలు కంటే చంద్రబాబునాయుడు ఎక్కువ హామీలు ఇవ్వడంతో చేస్తారనే ఆశతో ప్రజలు మోసపడ్డారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…