మన న్యూస్ ,నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నేతాజీ నగర్ నందు రెండు చోట్ల కలవార్ట్ ఇబ్బందికరంగా ఉండడంతో దాన్ని పగలు కొట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ ఇఇ శేషగిరి ని నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హాజరత్ నాయుడు డివిజన్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి ఇఇ ని తీసుకుపోవడం జరిగింది. పలు సమస్యలను వారికి చూపించి వాటిని వీలైనంతవరకు పరిష్కరించాలని కోరడం జరిగింది. అదేవిధంగా కలవార్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేయలని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఇఇ ని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా చేస్తామని చెప్పారు. పై కార్యక్రమంలో డివిజన్ టిడిపి నాయకులు, మున్సిపల్ ఇఇ శేషగిరి , అదేవిధంగా స్థానికులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *