మన న్యూస్, గూడూరు, మే 29:29 మార్చి 2025 నుండి 29 మే 2025 వరకు కొనసాగుతున్న షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఏర్పడుతున్న ఏ ఇబ్బందులు మన పీఠ భక్తులకు కలగనివ్వకుండా సద్గురువుల శ్రీ విజయ దుర్గ పీఠాధిపతుల వారి యొక్క ఆదేశానుసారంగా గూడూరు లోని శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఉపపీఠం నందు ప్రతి నిత్యం సుందరాకాండ లోని సర్గలు రోజుకు ఒకటి చొప్పున మొత్తం 68 సర్గ లకు హోమం మరియు పారాయణ కొనసాగుతున్నది. మే 29వ తారీకు ఉదయం సుందరకాండ సర్గాలన్నీ పూర్తి చేసుకుని పై 68 సర్గ లకు 68 పూర్ణాహుతులు మరియు ఉదయం 10.51 మొదలు 11 గంటల లోపు మహా పూర్ణాహుతి నిర్వహించబడుతున్నది. కార్యక్రమాల వివరాలు: ఉదయం పీఠంలో నిర్వహించే నిత్య కార్యక్రమాలు ఐదు గంటలకు మొదలయ్యి 8 గంటలకు పూర్తవుతుంది.8:30 మొదలు 11 పర్యాయాలు మన్యుసూక్త పారాయణతో హోమం సుందరకాండలోని చివరి స్వర్గ హోమముశ్రీ హనుమాన్ బడబానల స్తోత్రం హోమం శ్రీ హనుమాన్ లాంగుల స్తోత్ర హోమం తదుపరి శ్రీరామ పట్టాభిషేకం ఘట్టం యొక్క శ్లోకాలతో హోమం నిర్వహించబడుతుంది. తదుపరి 68 పూర్ణాహుతులు మరియు మహా పూర్ణాహుతి తో యాగం పూర్తవుతుంది. తదుపరి మధ్యాహ్నం 12 గంటల మొదలు భారీ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున మీరందరూ తప్పనిసరిగా విచ్చేసి శ్రీ విజయ దుర్గ అమ్మవారి మరియు హనుమంతల వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ విశేషమైన యాగంలో మీరు భాగస్వాములై అమ్మ కృపకు పాత్రులు కాగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *