మన న్యూస్ ,నెల్లూరు, మే 29:నెల్లూరు డైకాస్ రోడ్ లో కాకాణి గోవర్ధన్ రెడ్డి కుమార్తె.. కాకాణి పూజితని.. వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున , విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి కలిసి.. ధైర్యం చెప్పారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి .. నిప్పులాంటి మనిషని.. న్యాయస్థానాల్లో ఆయన తన నిజాయితీ నిరూపించుకొని.. క్లీన్ చీట్ తో బయటికి వస్తారని వారు తెలిపారు.గోవర్ధన్ రెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు.కాకాణి గోవర్ధన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసు బనయించి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను.. అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్.. చేస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తూ.. కక్ష్య సాధింపు చర్యలకు దిగుడం.. ఆ పార్టీ పతనానికి నాంది అన్నారు ప్రశ్నించే గొంతు నొక్కెందుకే… వైసీపీ నేతలపై ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలో తెలుగుదేశం పార్టీకి పరాభవం తప్పదని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *