నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

మన న్యూస్ ,నెల్లూరు : నెల్లూరు కేంద్ర కారాగారంలో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ………. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు.చేయని తప్పుకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకాణి గోవర్ధన్ రెడ్డి ని జైల్లో పెట్టిందన్నారు.ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని..కక్షపూరితంగానే ఇరికించారని అన్నారు. మైన్స్ కేసుకు సంబంధించి.. గత ప్రభుత్వంలోనే.. విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్ట్ లు ఇచ్చారని.. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష్య సాధింపు చర్యలో భాగంగా కేసు నమోదు చేసిందన్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో.. ప్రశ్నిస్తున్న గొంతును నొక్కాలనే.. ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు క్లీన్ చిట్ తో బయటికి వస్తారని తెలిపారు. జైల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ని కలిసినప్పుడు.. కార్యకర్తలకు అండగా ఉండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారని తెలిపారు.కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ జూన్ 4 వ తేదీన నిర్వహించబోయే వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని సూచనలు చేశారని తెలిపారు.కాకాని గోవర్ధన్ రెడ్డి సూచనలకు అనుగుణంగా.. జూన్ 4వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినాన్ని.. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను అర్థమయ్యేలా వివరించి.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ..నేతల పై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన.. బెదిరేది లేదని.. మరింత దూకుడుగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, 4,16 డివిజన్ ఇన్చార్జిలు సందాని,సగిలి జయరామిరెడ్డి,వైఎస్ఆర్సిపి నాయకులు సింగంశెట్టి అశోక్, అస్లాం, కొండయ్య శేఖర్,పెంచలయ్య,వెంకటేష్, ప్రసన్న, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచారం మరియు ప్రజా సంబంధాల ఐలాండ్ పిఆర్ శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ అనంతపురం కు బదిలీ అయ్యారు. సాధారణ బదిలీ…

    గవర్నమెంట్: సంఘాల గుర్తింపు రద్దు నోటీసుల ఉపసంహరణ….

    అమరావతి :(మన ద్యాస న్యూస్ )ప్రతినిది, నాగరాజు,, సెప్టెంబర్ 14 :/// ఉద్యోగ సంఘాలపై గత ప్రభుత్వ అరాచక చర్యలను కూటమి ప్రభుత్వం ఉప సంహరించుకోవడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేర్కొన్నారు.అరాచక చర్యలను కూటమి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి