మన న్యూస్, నెల్లూరు :నెల్లూరు కనుపర్తి పాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి.ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గం నుంచి భారీగా మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగ్గు మాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ……ప్రస్తుతం చంద్రబాబుతో భవిష్యత్ లో లోకేష్ ముఖ్యమంత్రిగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.కొత్త పరిశ్రమలు ఏర్పాటు తో కావలి నియోజకవర్గం ప్రగతి పథంలో ముందుకు సాగుతుంది అని అన్నారు.కూటమి ప్రభుత్వం రావడంతో లక్ష కోట్లు పెట్టుబడులుతో అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.మల్టి మోడల్ లాజిస్టిక్ పార్క్ ను బిట్రగుంట లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని తెలిపారు.కావలి నియోజకవర్గం అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు తో సాధ్యం.. అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *