నేను అక్రమ మైన్ ల గురించి చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కు తీసుకుంటా……… మాజీ మంత్రి ఫోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్

మన న్యూస్, నెల్లూరు ,మే 18 :నెల్లూరు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్భంగా ఆయన మరోసారి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై,సైదాపురం లో మైనింగ్ లో జరుగుతున్న అక్రమాలపై మాట్లాడారు. లీజులు ముగిసిన మైన్ లలో ప్రభుత్వం బోర్డులు పెట్టి,అక్రమ మైన్ ల పై, నేను మాట్లాడింది తప్పని నిరూపిస్తే వేమిరెడ్డికి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కి తీసుకుంటా అనిల్ సవాల్ విసిరారు.రాష్ట్రం లో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లేదు సంక్షేమం లేదు,దేశం లో ఎక్కడా లేనివిధంగా కేవలం కక్ష పూరిత రాజకీయాలు నడుస్తున్నాయి… అని అన్నారు.నిరాధార మైన కేసులు పెడుతున్నారు..ఒక డీజీపీ స్తాయి వారిని IAS,IPS అధికారులను కూడా వేదింపులకు గురిచేస్తున్నారు… అని తెలిపారు.10 రోజులు క్రితం నేను ఎవరి దురాలచన తో అక్రమ మైనింగ్ జరుగుతుందో ఆధారాలతో సహా మాట్లాడాను… అక్రమాలు చేస్తున్న వ్యక్తి దైవాంశ సంబూతుడి గా ఊహించుకుంటూ మీడియా ముందు మాట్లాడటం లేదు.. అని అన్నారు.వేమిరెడ్డి తరపున వకాల్తా పుచ్చుకుని బీద రవిచంద్ర మాట్లాడారు,కానీ నేను అడిగిన అక్రమ మైన్ లు గురించి నేరుగా సమాధానం చెప్పాలి… అని అడిగారు.వేమిరెడ్డి మంచివాడు గా కొందరు మైన్ యాజమానుల చే మాట్లాడించారు , మాట్లాడిన వారి మైన్ లు మాత్రం ఓపెన్ చేశారు,వాటి మీద పెనాల్టీ లు ఉన్నవి, పెనాల్టీ వున్న మైన్ లు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు.. అని అన్నారు.కోట్ల రూపాయలు ఫైన్ వున్న మైన్ లు ఓపెన్ చేశారు,ఫైన్ లేని మైన్ లు మాత్రం ఓపెన్ చేయడం లేదు ఎందుకు?. అని అడిగారు.సుమారు 120 పైన ఉన్న మైన్ లలో కేవలం 20 నుండి 30 మైన్ లు మాత్రమే ఓపెన్ చేయడం లో రహస్యం ఏంటి.. అని అడిగారు.ఒక వ్యక్తి దురాశ వల్ల 400 నుండి 500 కోట్లు రూపాయలు ఆదాయం ప్రభుత్వం కోల్పోతుంది.. అని అన్నారు.గతం లో 260 మంది ఎక్స్పోర్టర్స్ వున్నారు,ఇప్పుడు కేవలం ఒక్క ఎక్స్పోర్ట్ రు మాత్రమే ఉన్నారు ఎందుకు?…మైన్ ఓపెన్ చేయాలి అంటే బయ్యర్ వివరాలు అడుగుతున్నారు ఎందుకు? అని అడిగారు.చాలా పెద్ద మనిషి వందల కోట్లు బయట వ్యాపారాలు ఉన్నాయి ఈయన ఎందుకు క్వార్జ్ పై ఆసక్తి అని చూస్తే విస్తుపోయే నిజాలు తెలిసాయి అని అన్నారు.కేవలం 5,6 కోట్లు ఆదాయం కోసం వేల మందిని ఇబ్బంది పెడుతున్నారు అంటే అసలు విషయం అది కాదు… అని అన్నారు.సిద్ధి వినాయక,శ్రీనివాస పద్మావతి,శోభారాణి లాంటి లీజు ముగిసిన సుమారు 10 మైన్ లు గుప్పెట్లో పెట్టుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారు.. అని అన్నారుఈ మైన్ లలో ఉన్న క్వార్జ్ ద్వారా నెలకు 25 కోట్ల రూపాయలు సంపాదన తో సంవత్సరానికి 250 కోట్లు లెక్కన నాలుగేళ్లలో 1000 కోట్లు దోచేసేందుకు చూస్తున్నారు.. అని అన్నారు.5 కోట్ల రూపాయలు పెట్టుబడి తో1000 కోట్లు రూపాయలకు దోచుకోవాలని చూస్తున్నారు.. అని అన్నారు.నేను చాలెంజ్ చేస్తున్న మీరు లీజులు ముగిసిన మైన్ లలో అక్రమ మైనింగ్ చేయకుంటే ఎంపీ వేమిరెడ్డి, MLC రవిచంద్ర లు ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కు చెప్పి అక్కడ బోర్డులు పెట్టించండి అని అన్నారు.నేను అక్రమ మైన్ ల గురించి చెప్పిన విషయాలు తప్పు అని నిరూపిస్తే వేమిరెడ్డి కి క్షమాపణలు చెప్పి నా మాటలు వెనక్కు తీసుకుంటా… అని తెలిపారు.ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుకు డబ్బులు లేవు అంటున్నారు,ఇక్కడ లీజులు ముగిసిన మైన్ లలో ఉన్న 500 కోట్ల పైన విలువ చేసే క్వార్జ్ ను పబ్లిక్ ఆక్షన్ లకు పెట్టీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. అని అన్నారు.డబ్బున్నోళ్లు అందరూ మంచివాళ్ళు అనుకుంటే పొరపాటే,విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి వారి మోసం నిదానంగా బయట పడింది అని పరోక్షంగా వేమిరెడ్డి పై విమర్శలు చేశారు.400 వందల పైన MDL ఉంటే 30 MDL లు మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు అని అడిగారు.MLC రవిచంద్ర ను ఒక్కటే అడుగుతున్న వేమిరెడ్డి అక్రమ మైన్ లు చేయడం లేదు అంటే లీజులు ముగిసిన మైన్ లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అందులో మెటీరియల్ ద్వారా ప్రభుత్వానికి 500 కోట్లు నుండి 600 కోట్ల రూపాయలు వస్తుంది,కానీ ఒక్కరి జోబులోకి డబ్బు పోవడం ఏంటి.. అని తెలిపారు.అక్రమ మైనింగ్ పై నేను సైదాపురం వస్తున్నా అన్నందుకు 100 మంది పోలీసులను మోహరించారు ఎందుకు? అని అడిగారు.నేను వస్తున్నా అని తెలిసి అక్రమ మైన్ లో మిషనరీ ఎందుకు తరలించారు… అని అడిగారుజైలుకు వెళ్లేందుకు నేను అతీతుడిని కాదు…జయలలిత,చంద్రబాబు నాయుడు,YS జగన్మోహన్ రెడ్డి లాంటి వారే జైలుకు వెళ్ళారు నేను ఎంత… అని అన్నారు.పేదలు,కార్మికులు,చిరు వ్యాపారులు,వాహన దారులు ఇలా 10 వేల మంది పొట్ట కొట్టారు..కూటమి పుష్పా టాక్స్ పెట్టింది,ఎర్ర చందనం,క్వార్జ్ ఎక్కడకు పోతుంది.. అదే అన్నారు.వేమిరెడ్డి కంపెనీ పెడతా అన్నాడు, ఎప్పుడు పెడతాడు చెప్పాలి.,చైనాకు సరుకు రవాణా చేస్తున్నాడు,ఇక్కడ కంపెనీ పెడతాడా లేక చైనా లో పెడతాడా? అని అడిగారు.పట్టాఉన్న సరోజని మైన్ లో ఈ రోజు మీరు మిషన్ లు పెట్టి నీరు బయటకు పంపి పని చేస్తున్నారు కదా…వేమిరెడ్డి అయినా ఆయన వకాల్తా పుచ్చున్న వారు అయినా నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం లో అక్రమ మైనింగ్ పై పోరాటం చేస్తున్న BC ఆడబిడ్డ మాజీ ZPTC శిరీషను MLC బీద అభినందించాలి అని అన్నారు.మాజీ మంత్రి కాకాణి పై పేలుడు పదార్థాలు కేసు పెట్టారు,ఇప్పుడు అక్రమంగా ఎటువంటి వివరాలు లేకుండా జెలిటన్ స్టిక్స్ వాడుతున్న మైన్ యజమానులు పై కేసులు ఎందుకు పెట్టడం లేదు అని అనిల్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై ఘాటైన విమర్శలు చేశారు.

  • Related Posts

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):- విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష (కెజిబివి) కార్యదర్శి డి దేవానందరెడ్డి సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రం శంఖవరం కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయ (కెజిబివి)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 5 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///