

మన న్యూస్, నెల్లూరు రూరల్,మే 15 :శిలాఫలకాలలో జనసేన నాయకులు వేములపాటి అజయ్ పేరు తో కూటమి నాయకుల సఖ్యతను చాటారు పిలిస్తే పలికే నాయకులు ప్రజానాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న అని జనసేన నేత గునుకుల కిషోర్ అన్నారు.అభివృద్ధి కి అవకాశం ఇస్తే అది శ్రీధర్ అన్నే…. కోటంరెడ్డి శ్రీధర్ అన్నకు నెల్లూరు రూరల్ ప్రాంతమంతా జల్లెడ పట్టారు నెల్లూరు రూరల్ ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 339 పనులు 6 నెలల్లో పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు.నెల్లూరు రూరల్ 21వ డివిజన్,ఉమ్మారెడ్డి గుంట,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 339 అభివృద్ధి కార్యక్రమాలు 60రోజల లో పూర్తి చేసిన వాటిలో భాగంగా ఈ డివిజన్ లో ప్రారంబించాల్సిన ఏపి టిడ్కో ఛైర్మన్,జనసేన క్రమశిక్షణా విభాగం హెడ్,నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు వేముల పాటి అజయ్ కొంత అస్వస్థత తో రాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు కలిసి ప్రారంభించడం జరిగింది.ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి రికార్డు ఎవరికి సాధ్యపడలేదు…. మరల మరొకరికి సాధ్యపడదు. కూటమి నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ ఎంత అవగాహన తో అభివృద్ధి పనులు ముందుండి నడిపిస్తున్నారు.ఈ రోజు జనసేన తెలుగుదేశం నాయకులు 21 డివిజన్లో దానికి నిదర్శనంగా నిలిచి కూటమి ప్రభుత్వంలో జనసేన ప్రాముఖ్యతను చూపుతుంది.అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపినట్లుగా మరో 10 సంవత్సరాలు ప్రజల సంక్షేమం కోసం,రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పని చేస్తామని సవినయంగా తెలుసుకుంటున్నాము.రాబోయే మరొక సంవత్సరంలో 1000 కార్యక్రమాలు పూర్తి చేసి మరో రికార్డు సృష్టించాలి కోటంరెడ్డి సోదరులని కోరుకుంటున్నాను.శ్రీధర్ అన్న ఎలక్షన్లకు ముందు చెప్పారు ఇది మీ ఆఫీసు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అని అదేవిధంగా ఇప్పటికీ సాగుతూ …మా అందరికీ అందుబాటులో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నాయకత్వం లో రూరల్ కలిసి పనిచేసుకు పోతాము.
