

మన న్యూస్, నెల్లూరు రూరల్, మే 15:నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో గురువారం రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా కలెక్టర్ O. ఆనంద్, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరు స్రవంతి, టీడీపీ నాయకులు గిరిధర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా భారీగా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి .ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల జాతరలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చిన ఏకైక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అని కొనియాడారు. రూ.41 కోట్లతో 339 అభివృద్ధి పనులు కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేయడం గొప్ప విషయమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ.231 కోట్లు సాధించడం చిన్న విషయం కాదన్నారు. శ్రీధర్‌రెడ్డి అనుకుంటే తప్పకుండా సాధించి తీరతాడని చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఉన్నతస్థానంలో నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు వచ్చే అవకాశం కల్పించారన్నారు. ఇటీవల రూరల్ లోని ఆమంచర్లలో 60 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు శంకుస్థాపన చేశారన్నారు. వీటి ద్వారా స్థానికంగా వేలాదిమందికి ఉద్యోగాలు దొరుకుతాయని వివరించారు.ఈ సందర్భంగా వేదికపై ఉన్న జిల్లా కలెక్టర్‌కు ఎంపీ వేమిరెడ్డి ఈఎస్‌ఐ హాస్పిటల్ సిబ్బందికి వసతి ఏర్పాటుకు ఒక ఎకరా స్థలం అవసరమని తెలిపారు. హాస్పిటల్ నిర్మాణానికి స్థలం ఉందని, సిబ్బందికి వసతికి ఏర్పాటుకు స్థలాభావం ఉందన్నారు. తమరు పరిశీలించి ఎకరా స్థలం పరిశీలించి తెలియజేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ స్థలాన్ని పరిశీలించి తమ దృష్టికి తెస్తామని తెలిపారు.
