మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 15: నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు మే 15 గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం 33వ డివిజన్ నందు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 60 రోజుల క్రితం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకు గురువారం నెల్లూరు రూరల్ అంతట ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 33వ డివిజన్ నందు డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల మరియు క్లస్టర్ ఇంచార్జ్ మన్యం పెంచలనాయుడు మరియు డివిజన్ టిడిపి అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు దగ్గరుండి డివిజన్ టిడిపి కార్యకర్తలచే ఓపెనింగ్ చేయించి డివిజన్ ప్రజలకు అంకితం చేయడం జరిగింది. డివిజన్లో జరిగినటువంటి రోడ్లు మరియు డ్రైన్లు దాదాపు 1 కోటి 40 లక్షల రూపాయలు వ్యయంతో వెంగళరావు నగర్ మరియు నేతాజీ నగర్ నందు 11చోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగింది మరియు శిలా పలకాన్ని ప్రారంభించడం జరిగింది. డివిజన్ లో ఉన్నటువంటి ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరుస్తూ ఎన్నడు లేని విధంగా ఒకేసారి ఇన్ని అభివృద్ధి పనులను ప్రారంభించడం చూడలేదని స్థానికులు వెల్లడించారు. పై కార్యక్రమంలో డివిజన్ టిడిపి నాయకులు, యూనిట్ ఇన్చార్జీలు, బూత్ ఇన్చార్జీలు, బూత్ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *