మన న్యూస్, మంగళగిరి /నెల్లూరు, మే 14:- ఈ నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై చర్చ- పాల్గొన్న పలువురు మంత్రులు, సీనియర్ నేతలు.మే నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎస్.సవిత, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీద రవిచంద్ర యాదవ్, దామచర్ల సత్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతెన రామరాజు, సి.భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఆర్.మాధవి రెడ్డి, జీవీ ఆంజనేయులు, మంతెన సత్యనారాయణ రాజు, చింతకాయల విజయ్ పాల్గొన్నారు.

