కావలిలో త్వరలో ప్రెస్ క్లబ్ కు శంకుస్థాపన

మన న్యూస్, కావలి ,మే 13:- రాజకీయ చదరంగంలో భాగమే పైలాన్ విధ్వంసం- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు అభినందనలు- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడిప్రెస్ విలువలను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా త్వరలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బిజెపీ నాయకుల సమక్షంలో, జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్ల అందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావలిలో ఉన్నటువంటి ఆందరి రిపోర్టర్ల సమక్షంలో కావలిలో ప్రెస్ క్లబ్ కి శంకుస్థాపన చేస్తామని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….. సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగేత్తి చాటి ప్రజలను చైతన్య పరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి 2020 ఏప్రిల్ 11వ తేదీ అర్ధరాత్రి ప్రెస్ కి ఒక కళంకాన్ని తెచ్చి, ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్తూపాన్ని కూల్చిన ముద్దాయలను అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని, జిల్లా ఎస్పీ ని అభినందిస్తున్నామన్నారు. కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవ్వరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదని, ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ చదరంగంలో పైలాన్ని కూల్చడం జరిగిందని, వారిని కనిపెట్టి మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా అభినందిస్తున్నానని అన్నారు. నూతనంగా శంకుస్థాపన చేసే ప్రెస్ క్లబ్, నిజమైన ప్రెస్ క్లబ్ అనే విధంగా కావలిలో సంఘసేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీల నాయకులను, అందరి ప్రెస్ వాళ్ళని, అధికారులని ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ కు భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాకుండా, దుర్మార్గమైన పనులతో కాకుండా, అధికారుల అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ ని కట్టించి ఇవ్వబోతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ వారిని గౌరవిస్తుందని, ఎప్పుడు కూడా ప్రెస్ కి అండగా ఉంటుందన్నారు. సమాచారాన్ని అందించడంలో గాని, మీరు ఇచ్చినటువంటి సూచనలను పాటించడంలో గాని, సమాజంలో ఉన్నటువంటి లోపాలని వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాదరంగా ఆహ్వానించడంలో ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు