

మన న్యూస్ ,కోవూరు, మే 13:నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి , కోవూరు ఎమ్మెల్యే, టీ టీ డీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయుకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం నెల్లూరులోని విపిఆర్ నివాసానికి వచ్చిన కోట, వాకాడు మండలం టిడిపి నాయుకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఇటీవల నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి వైసీపీ కి గుడ్ భై చెప్పి సత్యవేడు లో ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. టిడిపి లో చేరిన సందర్బంగా వినోద్ రెడ్డి వేమిరెడ్డి దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వినోద్ రెడ్డి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే తో భేటీ అయ్యి వివిధ అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమం లో టిడిపి నాయుకులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి, సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
