మన న్యూస్ ,గూడూరు ,మే 11: గూడూర్ ( దూదేకుల )గూడూరు మండల అధ్యక్షులు షేక్ చాంద్ భాయ్ మరియు కమిటీ వారితో తో సమావేశం జరిగినది . ఈ సమావేశం లో 2024-2025 వ విద్యా సంవత్సరం లో పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన నూరుభాషా విద్యార్థిని , విద్యార్థులకు గౌ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ సహకారంతో బి ఎం ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ప్రోత్సాహక బహుమతుల కార్యక్రమం నిర్వహించ బడుననని తెలియచేయుచున్నాము. గుడూరు మండలం మరియు గుడూరు డివిజన్ పరిధి లో పదవతరగతి లో 500 మార్కులు , ఇంటర్మీడియట్ లో 900 లకు పైబడిన నూరుభాషా విద్యార్థిని విద్యార్థులు వారి మార్క్ ల లిస్ట్ , క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్ వివరములను గుడూరు మండలం కు సంబంధించి మండల అధ్యక్షులు షేక్ చాంద్ భాయ్ 9347701154 నంబర్ కు మే నెల 30 వ తేదీ లోపు అందచెయ్యవలెను . వచ్చిన అప్లికేషన్ లను పరిశీలించి తదుపరి ప్రతిభ ప్రోత్సాహక బహుమతుల తేదీని అందరికీ తెలియ చేస్తాము అని తెలియచేయడం జరిగినది .. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథి గా బీద మస్తాన్ రావు మరియు ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వ అధికారులు హాజరవుతారని తెలియచేయుట జరిగినది..ఈ కార్యక్రమము లో జిల్లా అధ్యక్షులు షేక్ సలీమ్,జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా ,ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్ , రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ దిల్షాద్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ సాహెబ్ , గుడూరు అధ్యక్షులు షేక్ చాంద్ బాషా, సెక్రటరీ,చాంద్ భాషా, నజీర్ భాయ్, కోశాధికారి షేక్ జిలానీ , జిల్లా యూత్ నాయకులు షరీఫ్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *