మన న్యూస్,నిజాంసాగర్,పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో బీరప్ప కామరతిల కల్యాణ మహోత్సవాన్ని సోమవారం మల్లికార్జున కురుమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు నూతనంగా నిర్మించిన బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.ఎమ్మెల్యేను మల్లికార్జున కురుమ సంఘం వారు గొంగళి కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా కురుమ సంఘం సభ్యులు గోసాయిపల్లి మల్లేశం మాట్లాడుతు..బీరప్ప కామరథిల కల్యాణ మహోత్సవాలు ఈ నెల 23న ప్రారంభమయ్యాయని మే 2న ముగుస్తాయని తెలిపారు.ఈ ఉత్సవాలు కురుమ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థుల సహాకారంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పిట్లం, పెద్ద కొడప్ గల్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరుసగా హన్మండ్లు, మహేందర్ రెడ్డి,నాయకులు మల్లప్పపటేల్, సాయిరెడ్డి,పాపిరెడ్డి,ఇస్మాయిల్ పటేల్,లింగం,
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,బంధువులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *