మన న్యూస్:మండల వ్యాప్తంగా ఉన్న రైతులు వరి ధాన్యం కుప్పలను రహదారిపై ఆరబోసి రోడ్డు ప్రమాదాలకు కారణం కాకూడదని ఏడూళ్ల బయ్యారం ఎస్సై రాజకుమార్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ధాన్యం కుప్పలను రోడ్లపై ఆరబోయవద్దని హెచ్చరించారు. వాహనదారులు కొన్ని సందర్భాలలో చూసుకోక కుప్పలపై వాహనం నడిపే ప్రమాదం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. రాత్రి వేళలో వాహనదారులు ఆ ధాన్యం కుప్పలను గ్రహించలేరు. కాబట్టి రైతులు ఎవరు కూడా రోడ్లమీద వరి ధాన్యాన్ని ఆరబోయవద్దని, ఆరబోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు పోలీసు వారికి సహకరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *