

మనన్యూస్,సింగరాయకొండ:ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన పాకల పల్లె పాలెం గ్రామం నుండి ఎంతో హర్షణీయమైన విజయం వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన గొల్లపోతు గాయత్రి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఎంపీసీ)లో 470కి 457 మార్కులు సాధించి తన ప్రతిభను చాటింది. గాయత్రి ఒంగోలు సరస్వతి జూనియర్ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాన్ని సాధించింది.తండ్రి సుబ్బారావు మత్స్యకారునిగా జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలలో గాయత్రి ద్వితీయ కుమార్తె. తన కృషికి ఇది ప్రతిఫలం అని గాయత్రి పేర్కొంది. ప్రభుత్వం తనకు చదువులో చేయూతనిస్తే, మరింతగా విజయం సాధించి రాష్ట్రానికి ఉపయోగపడే విద్యార్థినిగా నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ విజయంతో పాకాలపల్లె పాలెం గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. గ్రామస్థులు, బంధుమిత్రులు గాయత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
