మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ )మహమ్మద్ నగర్ మండలంలోని బొగ్గు గుడిసె చౌరస్తాలో ఐమాక్స్ లైట్లు వెలగకపోవడంతో ప్రయాణికులు చౌరస్తాలో దిగాలంటే భయాందోళన చెందుతున్నారు. నెలరోజుల క్రితం బొగ్గు గుడిసె చౌరస్తాలా ప్రక్కన హోటల్లు కావడంతో నూతనంగా 10 స్తంభాల వరకు ఏర్పాటు చేసి వాటికి లైట్లు ఏర్పాటు చేశారు. కొన్ని రోజులకి బల్బులు షాట్ కావడంతో అలాగే ఐమాక్స్ లైట్లు కూడా వెలగకపోవడంతో అంధకారంలో బొగ్గు గుడిసె ఉంది. ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించి ఐమాక్స్ లైట్ల తో పాటు స్తంభాలకు లైట్లను ఏర్పాటు చేసి వెలుగులను నింపాలని ప్రయాణికులు అటు నుంచి వెళ్లే ప్రజలు పత్రికా ముఖంగా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *