కలియుగమ్ 2064″ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు మణిరత్నం !!!

Mana Cinema:- ఆర్.కె.ఇంటర్నేషనల్ బ్యానర్ పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాత గా శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్సన్ థ్రిల్లర్ గా రూపొందిన “కలియుగమ్ 2064″ అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అసలే కలియుగమ్ ఆపై 2064… ఆ ఫ్యూచర్లో మనుష్యులు ఎలా ఉండబోతున్నారు ఎలా బ్రతుకబోతున్నారు ఎలా చావబోతున్నారు… అనే అంశాలతో… ఈ సినిమా కథ, కథాంశం ఉంటుంది. తెలుగు, తమిళ్ బైలింగవ్వల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం విడుదల చేశారు. “వినూత్న కథాంశంతో రాబోతున్న ”కలియుగమ్ 2064″ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు మణిరత్నం తెలిపారు. మొదటిసారి మణిరత్నం గారు ఇలా తెలుగు సినిమా పోస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సినిమా కాన్సెప్ట్, పోస్టర్ బాగుందని చిత్ర యూనిట్ సభ్యులతో చాలా సేపు ముచ్చటించడం గొప్ప విషయం. తెలుగులో హీరో నాని తో జెర్సీ మూవీ లో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలో నటించింది. అలాగే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన ప్రాత్రాల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీ లో మరో కీలకమైన పాత్రలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఈ మూవీ ఇప్పటి జెనరేషన్ కి చాలా అవసరమని , ఇది యువత ఫ్యామిలీ పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ అని , ఈ మూవీని అందరూ చూసి , మా ఈ క్రొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నామని, ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్ నార్వేలో చేబడ్డాయి, త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్.రామకృష్ణ తెలిపారు. నటీనటులు:
శ్రద్ధా శ్రీనాధ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు సాంకేతిక నిపుణులు: బ్యానర్ :ఆర్. కె. ఇంటర్నేషనల్ని, ర్మాత :కె. యస్. రామకృష్ణ, రచన & దర్శకత్వం :ప్రమోద్ సుందర్డై, రెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ :కె. రామ్ చరణ్ఎడిటర్ :నిమల్ ,సంగీత దర్శకుడు :డాన్ విన్సెంట్
ఆర్ట్ డైరెక్టర్ :శక్తి వెంకట్రాజు, సౌండ్ డిజైన్: తపస్ నాయక్

  • Related Posts

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

    మన న్యూస్ : బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజా చిత్రం ‘సోలో బాయ్’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్ కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు